అరకులోయ ప్రాంతంలో భారీ వర్షం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:43 AM

అల్లూరి జిల్లా అరకులోయ పట్టణ పరిసర ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో శనివారం సాయంత్రం మొదలైన వర్షం ఆదివారం కూడా విరామం లేకుండా కురుస్తోంది. కురుస్తున్న వర్షంతో పట్టణ పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అరకులోయ ప్రాంతంలోని సందర్శనకు వచ్చే పర్యటకులు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. రెండు రోజుల కురుస్తున్న వర్షాలతో అరకులోయ పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉన్న మట్టి రోడ్డు బురదమయమయ్యాయి. ఈ వర్షంతో చెరువులు వాగులు పంట పొలాలు నీటితో నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి.

Latest News

 
ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్న రఘురాం రెడ్డి Thu, Mar 23, 2023, 03:45 PM
ఏపీయూడబ్ల్యూజే వినూత్న నిరసన Thu, Mar 23, 2023, 03:16 PM
తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య Thu, Mar 23, 2023, 12:48 PM
సాయిబాబా ఆలయంలో విశేష పూజలు Thu, Mar 23, 2023, 12:45 PM
గురు సుఖదేవ్ 92 వ వర్ధంతి నివాళులు Thu, Mar 23, 2023, 12:44 PM