by సూర్య | Sun, Mar 19, 2023, 11:42 AM
గొలుగొండ మండలం ఎల్లవరం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందాడు. రాజవొమ్మంగి మండలానికి చెందిన అల్లి సతీష్ గత కొన్ని రోజులుగా ఎల్లవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శనివారం గొర్రెలను మేత కోసం గ్రామ సమీపంలోకి తోలుకువెళ్లాడు. గొర్రెలను మేపుతుండగా పిడుగు పడడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Latest News