సెలవు రోజు కూడా పని చేయనున్న జియంసి క్యాష్ కౌంటర్లు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:39 AM

గుంటూరు: పన్ను చెల్లింపుదార్లకు వీలుగా ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు యధావిధిగానే పని చేస్తాయని నగర కమీషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కూడా ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితిని పొందాలని తెలిపారు. నగరంలో నిర్మాణంలో భవన యజమానులకు ఖాళీ స్థల పన్ను పై వడ్డీ రాయితీ ప్రకటించడం సదవకాశమని, అలాగే నగరంలో ఖాళీ స్థల పన్ను విధించుకొని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివశించే యజమానులు కూడా వడ్డీ మినహాయింపు అవకాశాన్ని తెలియచేయాలని అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించామన్నారు.


సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లింపుదార్లకు వీలుగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లో కూడా క్యాష్ కౌంటర్లు ఉదయం 8 నుండి సాయంత్రం 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM