రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రాజెక్ట్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:35 AM

పలాస మండలంలోని, బ్రాహ్మణతర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బి. సాల్మన్ రాజు, పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు కొయ్యల శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో రూపొందించిన ' షూ గైడ్ ' ప్రాజెక్టు ఇన్స్పైర్ మనక్ రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికైందని ఆదివారము బ్రాహ్మనతర్ల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. తొలుత అంతర్జాలం ద్వారా జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో 240 ప్రాజెక్టులు పోటీపడగా 24 రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వగా అందులో షూ గైడ్ ప్రాజెక్ట్ ఒకటి. దృష్టిలోపం కలవారికి ఎటువంటి ఆరోధం లేకుండా సరైన మార్గ నిర్దేశనానికి, మహిళలు పిల్లలకు ఆపదలో ఉన్నప్పుడు ట్రాక్ చేయడానికి అలాగే సైనికులు, పోలీసులు బాంబులను గుర్తించడానికి ఈ షూ గైడ్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. సైన్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలో ఈ ప్రాజెక్టును తిలకించిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి. లాట్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి జి. పగడాలమ్మ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ కు ఎంపికైన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. వైకుంఠ రావు, ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, గ్రామస్తులు విద్యార్థి సాల్మన్ రాజు, మార్గదర్శి ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుని అభినందించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM