వాయిస్ ఆఫ్ హైదరాబాద్ విజేత 'పేట' గాయిని

by సూర్య | Sun, Mar 19, 2023, 11:29 AM

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో గత రెండు రోజులుగా జరుగుతున్న వాయిస్ ఆఫ్ హైదరాబాద్ పాటల పోటీలో నరసన్నపేటకు చెందిన గాయని చిన్నారి సోనాలిక ప్రధమ విజేతగా నిలిచారు. ఈనెల 17వ తేదీ నుండి 18వ తేదీ వరకు రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో భాగంగా మొదటి రౌండులో సుమారు 200 మంది గాయకులు పాల్గొనగా రెండో రౌండ్లో 22 మందిని ఎంపిక చేశారు. మూడో రౌండ్లో చేపట్టిన పోటీలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక విలేకరుల కాలనీలో నివాసం ఉంటున్న బుద్దల సోనాలిక ప్రధమ విజేతగా నిలిచారు. ఈ మేరకు శనివారం రాత్రి బహుమతి ప్రధానం నిర్వహించారు. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రధమ విజేతగా నిలిచిన సోనాలికకు స్థానిక వాసులు అభినందనలు తెలియజేశారు. గతంలో సోనాలిక మాటీవీలో ప్రసారం చేసిన జూనియర్ ఛాంపియన్స్ లో కూడా పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM