వామపక్ష నాయకులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:27 AM

జీవో నెంబర్ ఒకటి రద్దు పోరాట ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా అమరావతి, తాడేపల్లిలోని చలో అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే ఉద్దేశంతో వామపక్ష పార్టీ నాయకులను జిల్లా వ్యాప్తంగా ముందస్తుగానే 151నోటీసులిచ్చి పోలీసులు అరెస్టు చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావును శనివారం ఆయన స్వగృహంలో పోలీసులు నోటీసులిచ్చి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ గృహనిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరని, జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని హెచ్చరించారు, సిపిఐ పార్టీ నాయకులు అనపాన షణ్ముఖరావు మాట్లాడుతూ ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అమలుపరిచి ప్రజలను ఏ మార్చాలని చూస్తే సహించేది లేదని, గృహనిర్బంధాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వ అణచవేత తీర్పు నిదర్శనమని అన్నారు.

Latest News

 
రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై Fri, Jan 24, 2025, 08:25 PM
బెల్లం మార్కెట్ ను పరిశీలించిన అమెరికన్స్ Fri, Jan 24, 2025, 08:23 PM
రోడ్డు పనులను పరిశీలించిన టీడీపీ నేత Fri, Jan 24, 2025, 08:19 PM
టెస్ట్ డ్రైవ్ కోసం వచ్చిన కారు..అంతలోనే యాక్సిడెంట్ Fri, Jan 24, 2025, 08:18 PM
రైల్వే కోడూరులో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం Fri, Jan 24, 2025, 08:17 PM