ఆ రూట్ లో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు

by సూర్య | Sun, Mar 19, 2023, 11:23 AM

సారవకోట మండలంలోని అర్లి గ్రామం వద్ద గురువారం నుండి ప్రారంభమైన టోల్ ప్లాజా వల్ల ఆర్టీసీ చార్జీలు మరో పది రూపాయలు పెరిగాయి. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వరకు ఇదివరలో ఎల్ హెచ్ లకు 80 రూపాయలు చార్జీ ఉండగా ప్రస్తుతం అది 90 రూపాయలకు పెరిగింది. అలాగే అల్ట్రాపల్లె వెలుగు బస్సు కు ఇదివరలో శ్రీకాకుళం నుంచి పాతపట్నం కు 95 రూపాయలు చార్జి ఉండగా ప్రస్తుతం 100 రూపాయలకు పెరిగింది. శ్రీకాకుళం నుంచి కొరసవాడ, నవతల, బొంతు జంక్షన్ స్టేజిల వరకు పది రూపాయలు చార్జీ పెరిగింది. ఇదిలా ఉండగా సారవకోట నుంచి బొంతుకి ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా ఇదివరకు 10 రూపాయలు ఉన్న ఛార్జి ఏకంగా 20 రూపాయలకు పెరిగింది. బొంతు నుండి వచ్చే వారికి బొంతు నుంచి సారవకోట ఒక స్టేజ్ కావున ఇదివరలో ఎల్ హెచ్ లకు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులకు 10 రూపాయలు టికెట్ ఉండేది. ప్రస్తుతము టోల్గేట్ దాటిన తర్వాత జగన్నాధపురం, బురుజువాడ, జగ్గయ్యపేట, రైవాడ గ్రామాల నుంచి టోల్గేట్ లేనప్పటికీ సారవకోటకు మినిమం 20 రూపాయలు టిక్కెట్టుతీసుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు కిలోమీటర్ దూరంకు కూడా చార్జీలు పెంచేసారని లబోదిబోమంటున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించి టోల్గేట్ ఇవతల వైపు గ్రామాలకు మినిమం చార్జీ పది రూపాయలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Latest News

 
పులివర్తి నాని డ్రామాలాడుతున్నారు.. వీడియో రిలీజ్ చేసిన చెవిరెడ్డి Sat, May 25, 2024, 10:24 PM
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్.. కీలకమైన ఆదేశాలు Sat, May 25, 2024, 09:44 PM
ఏపీలో విచిత్ర వాతావరణం.. ఈ జిల్లాల్లో వానలు, అక్కడ అదరగొడుతున్న ఎండలు Sat, May 25, 2024, 09:39 PM
ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే: యూపీఎస్సీకి చైర్మన్‌కు చంద్రబాబు లేఖ Sat, May 25, 2024, 09:32 PM
రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం.. ఎంతో లక్కీ, ధర ఎంతంటే! Sat, May 25, 2024, 09:27 PM