అరటి, తమలపాకు కి భారీ నష్టం

by సూర్య | Sun, Mar 19, 2023, 11:22 AM

ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో అరటి, తమలపాకు రైతులకు తీర నష్టం జరిగింది. శనివారం సాయంత్రం ఉన్నట్లుండి బలమైన ఈదురుగాలులు వీయడంతో అరటి, తమలపాకు నేలకొరిగాయి. తంగేడుకు పల్లెలో రైతు చక్రపాణి రెడ్డికి చెందిన 22 ఎకరాలలో అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది. కోత సమయంలో ప్రకృతి వైపరీత్యంతో సుమారు కోటి రూపాయలు పైగా నష్టం వాటిల్లినట్టు ఆయన వివరించారు. చింతల మడుగులో వెంకటసుబ్బయ్య ప్యాక్ హౌస్ పై కప్పు ఎగిరి సమీప పొలాల్లో పడింది. పెద్దఎత్తున తమలపాకు తోటలు నేలకూలాయి.

Latest News

 
చరిత్రలో తొలిసారి.. సుప్రీంకోర్టులో ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు ప్రకటించిన సీజేఐ Tue, Feb 20, 2024, 09:55 PM
షాపులో పనిచేసే అమ్మాయితో ఎఫైర్.. ప్రశ్నించిన భార్యకు ఆ వీడియోలు చూపిస్తూ భర్త శాడిజం Tue, Feb 20, 2024, 09:50 PM
ఏపీలోనూ పీచు మిఠాయిపై నిషేధం Tue, Feb 20, 2024, 09:46 PM
గుడివాడ వైసీపీ టికెట్‌ ఎవరికో క్లారిటీ ఇదేనా.. ఒక్కమాటలో తేల్చేశారు Tue, Feb 20, 2024, 08:34 PM
విశాఖవాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. మొత్తానికి లైన్ క్లియర్ Tue, Feb 20, 2024, 08:28 PM