ఎమ్మెల్సీ ఫలితాలు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:41 AM

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ లు అన్నారు. శనివారం మండలంలోని శ్రీ అన్నమాచార్య అకాడమీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం పులివెందుల నుంచి ప్రారంభమవుతుందని, దీనికి సంకేతం నేటి ఎమ్మెల్సీ గా గెలుపొందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపే ఒక ఉదాహరణ అని అన్నారు.


ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించడం హర్షణీయమని, స్వాగతించదగ్గ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అయినా ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక, అవినీతి పాలనకు మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు మాడపూరి హేమలత, తోట శివశంకర్, తాటి సుబ్బరాయుడు, కొండిశెట్టి సుదర్శన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM