by సూర్య | Sun, Mar 19, 2023, 09:32 AM
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయం తీసుకుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పాటు ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. కాగా, రూ.2 కోట్ల లోపు ఉన్న టర్మ్ డిపాజిట్లకు ఈ పెంపు వర్తించనుంది. గడచిన మూడేళ్లలో ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.25 శాతం నుండి 6.50 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.90 నుండి 7.15 శాతానికి పెంచింది.
Latest News