వరదరాజ స్వామి ఆలయం పునర్ నిర్మాణ పనులు

by సూర్య | Sat, Mar 18, 2023, 08:59 PM

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ వరదరాజ స్వామి మూలవిరాట్ పానం మట్టం మధ్యలో అష్టమూలికా పంచాయతన బంగారు రేకులు బయటపడ్డాయి. శ్రీ వరదరాజ స్వామి మూల మూర్తి పానం మట్టం మధ్యలో 37 బంగారు రేకులు, రెండు కాసులు లభించాయి.. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పురాతన విష్ణు ఆలయం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా మూలమూర్తి తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఆలయంలో మూలమూర్తి తొలగించి అనంతరం మూలమూర్తిని పానమట్టం నుంచి జాగ్రత్తగా వేరు చేశారు. పానమట్టం లోపలికి ఒకటిన్నర అడుగు లోపల మూలమూర్తిని ప్రతిష్ట చేశారు. ఈ క్రమంలో పురాతనమైన ఈ విగ్రహం కింద ఆనాడు అష్టామూలక పంచాయతన బీజాక్షరాలు రాసిన 37 బంగారు రేకులు లభించాయి. అలాగే రెండు లక్ష్మీకాసులు దొరికాయి.. అలాగే నవరత్నాలు కూడా లభించాయి. శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు రెవెన్యూ పోలీస్ సిబ్బంది సమక్షంలో వీటిని దేవస్థానం అధికారులకు అప్పగించారు.


స్థానిక అప్రైజర్ ద్వారా లభించినవి బంగారాన్ని ధ్రువీకరించారని.. విష్ణుమూర్తి విగ్రహం కింద సాధారణంగా ప్రతిష్ట చేసేప్పుడు అష్టామూలకా పంచాయతనాలు, నవధాన్యాలు, నవరత్నాలు ఉంచుతారని.. వాటిని దేవస్థానానికి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ పోలీస్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 23న ఉదయం 9 గంటలకి వరదరాజుల స్వామి ఆలయ పునర్ నిర్మాణం పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం అధికారులు తెలిపారు.


Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM