వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 16ై సీట్లు,,,, ఎంపీ రామ్మోహన్ నాయుడు

by సూర్య | Sat, Mar 18, 2023, 08:58 PM

వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు వచ్చాయని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు ఛీ కొట్టారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి ఎంతో బలాన్నిచ్చాయని.. ప్రభుత్వ నిర్ణయాలతో విసిగిపోయిన ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి వైఖరిని స్పష్టంగా ఫలితాలతో చెప్పారన్నారు. టీడీపీకి అండగా నిలిచిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి అవసరం లేదని భావించి వారి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారని వ్యాఖ్యానించారు.


ప్రజలకు ఈ విజయం అంకితం అన్నారు. విశాఖ రాజధాని కావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని.. సీఎం రుషికొండకు గుండు గీయిస్తే ప్రజలు జగన్‌కు గుండు గీసి సమాధానం చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 160 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కీలకమైన బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుంటే సీబీఐ, హత్య కేసుల్లో చికుక్కున్న వారిని కాపాడుకోవడానికే సీఎం జగన్‌ హస్తినకు వెళ్లారన్నారు.


జగన్‌ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదు.. రాజధాని కబుర్లు నమ్మలేదన్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. టీడీపీ అభ్యర్థికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో విశాఖలో జగన్‌ చేసిన విధ్వంసం.. నాలుగేళ్ల చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరని గుర్తించారని.. అందుకే ఈ వన్‌సైడ్‌ ఫలితాలు వచ్చాయన్నారు. వైఎస్సార్‌సీపీ అంతానికి ఆరంభం ఇదే అన్నారు.


రాష్ట్రంలో ఎదురించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం శుభపరిణామం అన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. ఇప్పటికీ మేలుకోకుంటే స్వతంత్రానికి అర్ధం లేదని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ జీతగాళ్లు కృషి ఫలించలేదన్నారు. మంత్రులపై జగన్ భారం వేయడంతో ఇంకా వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు. బడ్జెట్‌లో వట్టి మాటలు చూపారని.. ప్రజాస్వామ్యం దేశంలో పది రక్షించుకోవడం అభినందనీయం అన్నారు. వేపాడ చిరంజీవికి అభినందనలు తెలిపారు.. ప్రజాస్వామ్యం పరిరక్షణ బాధ్యత తీసుకోవడం హర్షణీయం అన్నారు. ఎన్నికల్లో చాలా మంది కష్టపడ్డారు.. వారందరికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రజాస్వామ్య పటిష్టతకు ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయని.. పర్మినెంట్ డామేజ్ ఇప్పటికే జరిగింది అన్నారు. ఇంకా ఉన్న సమయంలో ఇంకెంత డామేజ్ చేస్తారో చూడాలన్నారు. ఈ ఎన్నికలు రిఫరెండం అని తాను అనుకోనని.. ప్రజల్లో ఆలోచన వచ్చి ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నారు. ప్రజలు ఓటును అమ్ముకోకుండా అన్యాయం, న్యాయాన్ని బేరీజు చేసుకొని ఓటేయాలన్నారు. ప్రజల్లో ఆలోచన వస్తే ఇలాంటి వారు పాలించలేరన్నారు. ఈ ఫలితాల ద్వారా మూర్ఖులు బుద్ధి తెచ్చుకొని మారాలని కోరుకుంటున్నారని.. అసెంబ్లీని టీడీపీ కట్టింది. ప్రజా వేదికను కూల్చిన ఈ ప్రభుత్వం అసెంబ్లీని ఎందుకు కూల్చలేకపోయిందన్నారు. చిన్న గోతులను పెద్దగోతులు చేసిన వైసీపీ పాలకులన్నారు అశోక్. ప్రజల కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని.. చట్టాలను చుట్టాలుగా మార్చుకోవడం ఎవరికి మంచిది కాదన్నారు. ఈ ఫలితాలు ద్వారా మంచి, చెడు ప్రభావాలను బేరీజు వేసుకోవాలన్నారు.


Latest News

 
వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు... జనంలోకి పవన్ కళ్యాణ్ Fri, Jun 02, 2023, 09:26 PM
ఏపీపై బీజేపీ అగ్రనేతల ఫోకస్....ఇక్కడ కమలం వికసించేనా Fri, Jun 02, 2023, 09:23 PM
జనంలోకి జనసేనాని.... రూట్ మ్యాప్ పై తీవ్ర చర్చ Fri, Jun 02, 2023, 09:22 PM
టీడీపీ ఒరిజినాలిటీకి, క్రియేటివిటీకి మారుపేరు.... చంద్రబాబు Fri, Jun 02, 2023, 08:59 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ Fri, Jun 02, 2023, 08:40 PM