రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి, మోసపూరితం: సిఐటియు

by సూర్య | Sat, Mar 18, 2023, 07:46 PM

రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన 2, 79, 000 కోట్ల రూపాయలు అంకెల గారడీ, మోసపూరిత బోగస్ బడ్జెట్  అని అన్నమయ్య జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ అన్నారు. రైల్వే కోడూరు  సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ అంచనాలకు ఆచరణకు పొంతన లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ అంకెల మోసమే అన్నారు. వసూళ్లు, కేటాయింపులు, ఖర్చులకు పొంతన లేదన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు, కొత్త పరిశ్రమలు రాలేదు, ఉపాధి లేదు అన్నారు. కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి అమలు చేయలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, కోశాధికారి కరతోటి హరి నారాయణ పాల్గొన్నారు.

Latest News

 
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు Fri, May 17, 2024, 09:17 PM
విశాఖ వందేభారత్ ఐదు గంటలు ఆలస్యం.. ఈ రైళ్లు బయల్దేరే సమయం మారింది Fri, May 17, 2024, 09:13 PM
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..ఈ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు Fri, May 17, 2024, 09:09 PM
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ Fri, May 17, 2024, 09:05 PM
రాడ్ తీయించుకునేందుకని ఆస్పత్రికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు Fri, May 17, 2024, 09:01 PM