పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజలకు ఆర్థిక భద్రత

by సూర్య | Sat, Mar 18, 2023, 07:23 PM

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజలకు ఆర్థిక భద్రత కలుగుతుందని చీరాల సబ్ డివిజన్ పోస్టల్ ఏ. ఎస్. పి ఐ. శివరామకృష్ణ చెప్పారు. చీరాల గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తూ డెంగ్యూ వ్యాధితో మరణించిన పోకూరి రవి భార్య పోకూరి శిరీషకు ఆయన శనివారం పోస్టల్ బీమా కింద మంజూరైన 11 లక్షల 68 వేల రూపాయల చెక్కును వేటపాలెంలో అందజేశారు. పోకూరి రవి 2. 79 లక్షల రూపాయలు ఈ పథకంలో వెచ్చించగా అయన కుటుంబానికి నాలుగు రెట్లు అదనంగా బీమా మొత్తం అందిందని శివరామకృష్ణ చెప్పారు.


ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే పోస్టల్ ఇన్సూరెన్స్ పధకం సురక్షితమని, ఆర్థికపరంగా ప్రయోజనకరమని ఆయన వివరించారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి అవసర సమయంలో ఆర్థిక సాయం అందజేసిన పోస్టల్ శాఖ అధికారులకు శిరీష కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేటపాలెం, రావూరిపేట, పందిళ్ళపల్లి సబ్ పోస్ట్ మాస్టర్లు శ్రీనివాసరావు, గోపికృష్ణ, గంగాధరరావు కూడా పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM