రోడ్డు మార్గంలో తిరుమ‌ల చేరుకున్న నారా లోకేష్

by సూర్య | Wed, Jan 25, 2023, 11:39 PM

పాదయాత్రకు సిద్దమవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  రోడ్డు మార్గంలో తిరుమ‌ల చేరుకున్నారు. ఇదిలావుంటే ఈ నెల 27న టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ 'యువ‌గ‌ళం' పేరుతో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. కుప్పం నుంచి శుక్ర‌వారం ఆరంభ‌మై, 4 వేల కిలోమీట‌ర్లు, 400 రోజుల‌పాటు సాగే యాత్ర‌కి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ ఉద‌యం ఆయన కుటుంబంతో కలిసి పూజ‌లు నిర్వ‌హించారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న లోకేశ్, అత్తామామ‌లు, బంధువులంద‌రి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు కొడుకుని హ‌త్తుకుని ఉద్వేగానికి గుర‌య్యారు. 


అనంతరం భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకుని, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, తాత నంద‌మూరి తార‌క‌రామారావుకి నివాళులు అర్పించారు. తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని క‌డ‌ప వెళ్లారు. కడపలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి. కడప వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం కడప పెద్ద దర్గాని సంద‌ర్శించి, చాదర్ సమర్పించారు. మత పెద్దలను అడిగి దర్గా విశిష్టతను తెలుసుకున్నారు. క‌డ‌ప‌లోనే మరియాపురం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమ‌ల చేరుకున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే ఆయన బస చేస్తారు.


Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM