కోర్టులో వాదించబోతున్న రోబో లాయర్

by సూర్య | Wed, Jan 25, 2023, 11:39 PM

మనం ప్రపంచంలో ఎన్నో వింతలను చూస్తూవుంటాం. తాజాగా మరో కొత్త వింతను చూడబోతున్నాం. ఇదిలావుంటే కృత్రిమ మేథస్సు (ఏఐ - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అనేది ఇప్పుడు ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ. డ్రైవర్ లేకుండానే కారు వెళ్లడం, మీ ఇంటి ఫ్రిడ్జ్ లో కోడిగుడ్లు ఉన్నాయా, లేదా చెప్పడం లాంటివెన్నో దీని కిందకు వస్తాయి. ఏఐ అనేది రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించబోతోంది. ఇప్పటి వరకు మన జీవితాల్లోకి ప్రవేశించిన టెక్నాలజీ... రాబోయే రోజుల్లో ఏఐ రూపంలో మన ఇంట్లోకి కూడా ప్రవేశించబోతోంది. 


ఏఐ అనేది మన జీవితాలకు చాలా ప్రమాదకరం అని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ... అది మన జీవితాల్లోకి చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో, వచ్చే నెలలో ఒక రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారి కోర్టులో కేసును వాదించబోతోంది. అమెరికాలోని కోర్టులో వాదనలను వినిపించబోతోంది. 


డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని సృష్టించింది. ట్రాఫిక్ చలానాకు సంబంధించిన కేసును ఈ రోబో వాదించబోతోంది. అయితే, ఈ కేసు విచారణ ఏ కోర్టులో జరుగబోతోందో ఆ కంపెనీ వెల్లడించలేదు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపినందుకు విధించిన చలానా కేసులో ఈ రోబో న్యాయవాది తన వాదనలను వినిపించనుంది.


Latest News

 
పెరుగుతున్న చీనీ ధరలు Fri, Mar 29, 2024, 02:43 PM
ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 02:42 PM
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి Fri, Mar 29, 2024, 02:41 PM
కూటమి తోనే బీసీలకు రక్షణ Fri, Mar 29, 2024, 02:39 PM
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM