అపుడు మీరెక్కడున్నారు రాయోజీ గారు,,,ఏపీ మంత్రి మేరుగ నాగార్జున

by సూర్య | Wed, Jan 25, 2023, 11:38 PM

సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నారు? అంటూ రామోజీరావును  ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు.సబ్ ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ ఈనాడు పత్రికలో కథనాలు రావడంపై ఆయన మండిపడ్డారు. ఈనాడు అధినేత రామోజీరావు వాస్తవాలను తెలుసుకుని రాస్తే బాగుంటుందని అన్నారు. సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నారు? అంటూ రామోజీరావును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నీ రాతలు ఏమయ్యాయని అడిగారు. చంద్రబాబు హయాంలో జరిగిన అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు దత్తపుత్రుడు అవాస్తవాలను మాట్లాడుతున్నాడని మంత్రి విమర్శించారు. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబుకు పవన్ ఎలా మద్దతు తెలిపారని ప్రశ్నించారు.


Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM