అనారోగ్యం తో టీడీపీ నాయకుడు మృతి

by సూర్య | Wed, Jan 25, 2023, 03:22 PM

ప్రకాశం జిల్లా, టీడీపీ సింగరాయకొండ మండల మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు చీమకుర్తి వెంకటేశ్వర్లు (60) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన మూలగుంటపాడులో తన స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వామి, దామచర్ల పూర్ణ చంద్రరావు మూలగుంటపాడు వచ్చి వెంకటేశ్వర్లు పార్ధివదేహాన్ని సంద ర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి అయిన మాజీ ఎంపీపీ రమణమ్మ, కుమారులు శ్రీకాంత్‌, కృష్ణను కలసి ఓదార్చారు. టీడీపీ సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల అధ్యక్షులు వేల్పుల సింగయ్య, పోకూరి రవీంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య, టీడీపీ నేతలు షేక్‌ సంధానిబాషా, రాచగర్ల వెంకట్రావు, నారాయణ స్వామి, పోటు పెదబాబు, కూనపురెడ్డి సుబ్బారావు, మందలపు గాంధీ చౌదరి, ఇమ్మిడిశెట్టి రామారావు, మించల బ్రహ్మయ్య, వేల్పుల వెంక ట్రావు, చంటి, షేక్‌ అజీం, అబ్దుల్‌ సుభానీ, నియోజకవర్గంలో పలువురు టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సందర్శించిన నివాళులర్పిం చారు. సాయంత్రం నిర్వహించిన అంతిమయాత్రలో ఎమ్మెల్యే స్వామి పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు టీడీపీలో సాధారణ కార్యకర్త నుంచి అంచెలం చెలుగా ఎదిగారు. దాదాపు 20 ఏళ్లపాటు పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2001 నుంచి 2006 వరకూ ఆయన సతీమణి రమణమ్మ ఎంపీపీగా పనిచేశారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM