రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by సూర్య | Wed, Jan 25, 2023, 03:22 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెంలోని పాలశీతలీకరణ కేంద్రం సమీపంలో జరిగింది. బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీరభద్రాపురం గ్రామా నికి చెందిన చప్పిడి చెన్నకేశవులు, సంగాల వెంకటమ్మ (50)లు మిరప కోతల కోసం ద్విచక్ర వాహనంపై త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామానికి పనులకు వెళుతున్నారు. వీరి వాహనానికి పాలకేంద్రం వద్ద పంది అడ్డుగా వచ్చింది. దీన్ని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదం లో వెనుక సీటులో కూర్చొన్న సంగాల వెంకటమ్మ తలకు తీవ్రగాయమైంది. బాధితులకు ఎర్రగొండపాలెం వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. గాయపడిన చెన్నకేశవులు స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. తలకు బలమైన గాయమైన వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు వైద్యశాలకు స్థానిక తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM