రైతులకు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న సీఎం మాట మరిచారు

by సూర్య | Wed, Jan 25, 2023, 03:24 PM

మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన సైకో సీఎం జగన్‌రెడ్డిని గద్దె దింపటానికి ప్రజలు సిద్ధం కావాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని యరజర్ల, నగరంలోని త్రోవగుంట అంబేడ్కర్‌ కాలనీలలో మంగళవారం రాత్రి ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...  పాదయాత్రలో జగన్‌రెడ్డి హామీలిచ్చి, అవి నెరవేర్చలేక మాటతప్పి మడమతిప్పి ప్రజలను మోసం చేశారన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు. అభివృద్ధి పనులు ఎక్కడా చేసిన దాఖలాలు లేవన్నారు. రైతులకు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న సీఎం మాట మరిచారన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు సాగుకు విరామం ప్రకటించే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. నిత్యావసరాల ధరలతోపాటు కరెంట్‌, గ్యాస్‌, ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచి పేదలను ఆర్థిక ఇబ్బందులోకి నెట్టారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు నల్లమోతు బాలగంగాధర్‌, ఎంపీటీసీ సభ్యుడు జీ శ్రీనివాసరావు, 1వ డివిజన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు కొఠారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివా సరావు, పోలవరపు వెంకటరామయ్య, గుర్రాల రాజ్‌విమల్‌, చుండి శ్యామ్‌మ, నావూరి కుమార్‌, కాకర్ల ఈశ్వర్‌, బండారు మధన్‌, పెద్దశెట్టి వరలక్ష్మి, హజీమునీషా, గంగవరపు పద్మ, పల్లపోలు వెంకటేశ్వర్లు, నల్లమోతు రమేష్‌, కార్పొరేటర్‌ అంబూరి శ్రీను, కొక్కెల గడ్డ లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM