ఏస్వేచగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

by సూర్య | Wed, Jan 25, 2023, 03:16 PM

నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్‌ కరకట్టలను గ్రావె ల్‌ మాఫియా నుంచి కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపి సీనియర్‌ అసిస్టెంట్‌ కొండలరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నమామిగంగే రాష్ట్ర ప్రముఖ్‌ మిడతల రమేష్‌ మాట్లాడుతూ...  అధికార పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం గ్రావెల్‌ అక్రమ తవ్వకాలతో రిజర్వాయర్‌ కరకట్టలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ లేఔట్ల పేరుతో ప్రైవేటు లేఔట్లలో రియల్‌ వ్యాపారులకు గ్రావెల్‌ తోలి కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ చర్యలు చేపట్టి రిజర్వాయర్‌న పరిరక్షించకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామిశెట్టి మోహన్‌బాబు, కాసా శ్రీనివాసులుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో ఎనిమింది మంది ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు Mon, Feb 26, 2024, 11:20 PM
రేపు ఏపీలో పర్యటించనున్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ Mon, Feb 26, 2024, 09:52 PM
విశాఖవాసులకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే రూ.25వేలు జరిమానా, వారికి మాత్రం రూ.వెయ్యి Mon, Feb 26, 2024, 09:46 PM
ఏపీలో తొలి గ్యారెంటీని ప్రకటించిన షర్మిల.. ఇంటింటికీ ఎంతంటే Mon, Feb 26, 2024, 09:37 PM
టికెట్ వచ్చిన ఆనందంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి.. ఇంతలోనే ఫోన్ చేసి చంపేస్తామని బెదిరింపులు Mon, Feb 26, 2024, 08:47 PM