ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోలేరు

by సూర్య | Wed, Jan 25, 2023, 03:15 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర తప్పదని నెల్లూరు జిల్లా, టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం లేబూరు గ్రామంలో ఇదేమీ ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పదవికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్రచౌదరి, నాయకులు చెంచుకిషోర్‌యాదవ్‌, చెముకుల కృష్ణచైతన్య, కొండూరు సుధాకర్‌రెడ్డి, దొడ్ల నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్‌రెడ్డి, ఉదయగిరి పెంచలయ్య, గంపల అనిల్‌కుమార్‌, ఈదూరు చెన్నయ్య, మునగాల రంగారావు పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM