పీఏబీఆర్‌ డ్యాం మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో పది లక్షల చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే

by సూర్య | Wed, Jan 25, 2023, 03:18 PM

ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను సరఫరా చేయాలని, అప్పుడే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఎనిమిది లక్షల చేపపిల్లలను మంగళవారం ఆయన పీఏబీఆర్‌ డ్యాంలో వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు లబ్ధిదారుల వాటాతో చేపపిల్లలను అందిస్తున్నారని అన్నారు. అలాకాకుండా, వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను అందిస్తే రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు బోట్లు, వలలు తదితర సామగ్రిని అందించామని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఇటీవల పేరూరు డ్యాం నుంచి నీరు పెద్ద ఎత్తున రావడంతో మత్స్యకారులు నష్టపోయారని, బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పీఏబీఆర్‌ డ్యాం మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో పది లక్షల చేపపిల్లలను వదులుతున్నామని, ప్రస్తుతం ఎనిమిది లక్షల చేపపిల్లలు అందుబాటులో ఉన్నాయని మత్స్యశాఖ డీడీ శాంతి తెలిపారు. అంతకుముందు డ్యాంలో పయ్యావుల కేశవ్‌ గంగపూజ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, బ్రహ్మయ్య, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM