అక్రమ రవాణాకు సహకరిస్తే సస్పెండ్ చేస్తాం: తహశీల్దార్ బి. రాము

by సూర్య | Wed, Jan 25, 2023, 02:16 PM

ప్రభుత్వం పేదలకు సబ్సిడీపై అంది స్తున్న బియ్యం అక్రమ రవాణాకు విఆర్ఓలు, స్టోర్ డీలర్లు, ఎండిఎస్ సిబ్బంది సకరిస్తే ఆనాటి వారిని ఉపేక్షించేది లేదని సస్పెండ్ చేస్తామని గుంతకల్లు మండల తహశీల్దార్ బి. రాము హెచ్చరించారు. మంగళ వారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం కౌన్సిలర్ సమావేశ భవానంలో విఆర్ఓలు, స్టోర్ డీలర్లు, ఎండిఎస్ సిబ్బందితో ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో గుంతకల్లు పట్టణ, మండల పరిధిలో పేదలకు అందిస్తున్న సబ్సిడీ బియ్యం యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతున్నట్లు ఫిర్యాదులు అందు తున్నాయన్నారు. సబ్సిడీ బియ్యం అమ్మినా, కొనుగోలు చేసినా అక్రమ రవాణా చేసినా శిక్షార్హులు అవుతా రన్నారు. బియ్యం అక్రమంగా అమ్మకాలు చేస్తే అలాంటి వారికి బియ్యం పంపిణీ నిలువు చేస్తా మన్నారు. సచివాలయాల పరిధిలో బియ్యం కొనుగోలుకు వచ్చిన వారిపై విఆర్ఓలు, డీలర్లు నిఘావేసి ఉంచి తమకు సమాచారం ఇవ్వాల న్నారు. అలా కాకుండా తమకేమీ పట్టనట్లు బాధ్యతలు విస్మరిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాను సమిష్టిగా అరిక ట్టేందుకు సహకారాన్ని అందించా లన్నారు. ప్రజా పంపిణీలో సమస్యలు ఏమైనా ఉన్నా తనకు తెలియజేయా లన్నారు. ఈ సమావేశంలో సిఎస్ డిటి సుబ్బలక్ష్మి, విఆర్ఓలు, స్టోర్ డీలర్లు, ఎండిఎస్ లు పాల్గొన్నారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM