ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు లేదా?

by సూర్య | Wed, Jan 25, 2023, 02:16 PM

ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం  నారా లోకేష్  చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కు ఆంక్షలు, ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు  విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర ప్రభంజనంతో జగన్ రెడ్డి అవినీతి కోటలు బద్దలవడం ఖాయమన్నారు. బందోబస్తు కల్పించాల్సిన పోలీసులు పాదయాత్రకు ఆంక్షలు విధించడమేంటని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు లోకేష్ పాదయాత్ర కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను పాదయాత్రలో ప్రజలకు వివరిస్తామని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM