![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 10:17 AM
ప్రెస్ అకాడమీని బలోపేతం చేసి, పాత్రికేయుల సంక్షేమానికి ప్రత్యేక నిధి కేటాయించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సోషల్ మీడియాతో ఎన్నో అనర్ధాలు ఉన్నాయని, వాటి నియంత్రణకై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలను తక్షణమే పునరుద్ధరణ చేయాలని, సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన మీడియా ప్రతినిధులకు తహిసీల్ధార్ స్థాయిలో ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, వీటిని నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Latest News