రోడ్డు ప్రమాదంలో సిఐడి ఎస్ఐ కు తీవ్ర గాయాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:19 AM

రోడ్డు ప్రమాదంలో సిఐడి సబ్ ఇన్స్పెక్టర్ కు తీవ్ర గాయాలైన సంఘటన శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన గొర్లె అర్జున్ సిఐడి డిపార్ట్మెంట్లో ఎసై గా పనిచేస్తున్నారు. ఆయన బుధవారం తన విధి నిర్వహణలో భాగంగా రాజమండ్రి వెళ్లేందుకు కొత్తవలస నుండి సబ్బవరం రోడ్డు మీదగా అనకాపల్లి చేరుకునేందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తవలస మండలం గులివిందాడ గ్రామానికి చెందిన వ్యక్తి యొక్క ద్విచక్ర వాహనం ఆయనను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అర్జున్ కు తీవ్ర గాయాలైన క్రమంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 వాహనంలో విశాఖపట్నం సెవెన్ హిల్స్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM