మునగ సాగుతో అధిక దిగుబడులు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:12 AM

మునగ సాగుతో అధిక దిగుబడులు సాధించి ఆర్థిక పరిపుష్టిత సాధించ వచ్చునని సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి వి. సతీష్ బాబు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కోటబొమ్మాలి మండలం, బ్రేకులు పాడు గ్రామంలో పల్లి ధర్మారావుకి చెందిన మునగ తోటను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సాగు విధానము వాటి స్థితిగతులను రైతు ధర్మారావుని అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులు ఒకే పంటని వేయకుండా ఇటువంటి లాభదాయకమైన తోటలను పెంచుకొని అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట క్వాలిటీ కంట్రోల్ జే ఈ లు ఎన్. శ్రీహరి, సుధాకర్, సాంకేతిక సహాయకులు ఎన్. గోపాలకృష్ణ ఉన్నారు.

Latest News

 
మూడు రాజధానులకు అందరి మద్దతు ఉంది : మంత్రి గుడివాడ అమర్‌నాథ్ Sun, Nov 27, 2022, 10:21 AM
తెలంగాణ అభివృద్ధిని చూసే ఏపీ ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారు Sun, Nov 27, 2022, 12:17 AM
భారీ స్థాయిలో పోలీస్ శాఖ నియామకాలు...త్వరలోనే నోటిఫిషన్ Sun, Nov 27, 2022, 12:11 AM
జగన్ రెడ్డి ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఊడబెరికాడని: అనిత Sun, Nov 27, 2022, 12:10 AM
తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ Sat, Nov 26, 2022, 09:41 PM