ఆధార్ కార్డుతో సైబర్ మోసాలు: ఎస్పీ

by సూర్య | Thu, Nov 24, 2022, 09:58 AM

కొందరు ఆధార్ కార్డుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఎస్పీ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన జారీ చేశారు. తెలియని వ్యక్తులకు ఎవరూ ఆధార్ వివరాలు చెప్పకూడదన్నారు. నకిలీ బయోమెట్రిక్ ద్వారా ఖాతాలోని నగదు మాయం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సాంకేతిక యుగంలో ఆధార్ ఆధారంగా భారీగా మోసాలు పెరిగాయన్నారు. బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన ఆధార్, వేలి ముద్రలు రూపొందించి వాటిని ఉపయోగించి ఖాతాల్లో నగదును కాజేస్తున్నారని పేర్కొన్నారు.


యూఐడీఏఐ వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా బయోమెట్రిక్ లను లాక్ చేసుకోవాలని సూచించారు. చరవాణి సంఖ్య, ఇ-మెయిల్ ఆధార్ తో లింక్ చేయడం సురక్షితమన్నారు. తద్వారా ఓటీపీ లేకుండా ఆధార్ వివరాలు తెలిసే అవకాశం ఉండదన్నారు. ఎవరికైనా ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తే మాస్క్ చేసిన కార్డును ఇవ్వాలన్నారు. డేటా వినియోగించిన సంస్థలపై అనుమానముంటే 1930కు డయల్ చేయాలని ఆయన సూచించారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM