అల్పపీడన ప్రభావంతో చెన్నూరులో వర్షాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 09:56 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చెన్నూరు మండల వ్యాప్తంగా రెండు రోజులుగా మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం, బుధవారం ఉదయం వరకు వర్షం కురిసింది. 13. 4 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు నమోదు చేశారు. చెన్నూరు మండల వ్యాప్తంగా చాలాచోట్ల చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. పెన్నా నది ఎగువ భాగంలో వర్షాలు కురవడంతో పెన్నా నదికి నీటి ప్రవాహం పెరుగుతున్నది. పెన్నా నది ఎగువ భాగంలో అదినిమ్మాయిపల్లి ఆనకట్ట మీద నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తున్నది. చెన్నూరు వద్ద బుధవారం సాయంత్రానికి 7000 క్యూసెక్కుల నీరు దిగనున్న సోమశిల ప్రాజెక్టులోకి చేరుతున్నది.

Latest News

 
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM