జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

by సూర్య | Thu, Nov 24, 2022, 09:53 AM

ఈనెల 28, 26, 27, తేదిలలో రాజమండ్రిలో జరిగే జాతీయ మహా సభలను జయ ప్రదం చేయాలని వేంపల్లె భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు బల్లారపు రామాంజనేయులు పిలుపు నిచ్చారు. బుధవారం వేంపల్లి పట్టణంలోని స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఆ సంఘం నాయకులు పాల్గొని జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ పత్రాలు విడుదల చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలకు పెద్ద ఎత్తున ప్రతి కార్మిక సంఘం నాయకులు పాల్గొని కార్మిక ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అంతేకాకుండా కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాయితీలు, సంక్షేమ పథకాలపై గళం విప్పి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అందరూ సమిష్టిగా పోరాడాలని సూచించారు. గత కరోనా కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం నుంచి అందాల్సిన క్లెయిన్స్తో పాటు కార్మిక చట్టం ద్వారా చేరాల్సిన ఆర్థిక సహాయం పొందేందుకు వీలుగా ఈ మహాసభల ద్వారా సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి చల్లాబాలాజీ, గౌరవ అధ్యక్షుడు రమణయ్య, ఉపాధ్యక్షుడు దస్తగిరి, కోశాధికారి నాగేశ్వరరావు, రమేష్ బాబు, జమాల్ బాషా, సిద్దయ్య, సిపిఐ బాషా, చిన్న టోపి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM