అభద్రతా భావంలో చంద్రబాబు

by సూర్య | Thu, Nov 24, 2022, 09:26 AM

రోజు రోజుకూ చంద్రబాబు నాయుడు అభద్రతాభావానికి లోనవుతున్నారని చివరి అవకాశమంటూ ప్రజలను అడుక్కోవడం చాలా బాధగా ఉందని ఉప ముఖ్య మంత్రి అంజాద్‌బాష పేర్కొన్నారు. బుధవారం కడప ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వతంత్ర భారత దేశంలో మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు.


ఐదేళ్లల్లో చంద్రబాబు హయాంలో మైనార్టీలకు ఏమి చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. మైనార్టీకి చెందిన వ్యక్తికి కనీసం మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలపై తన సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే నవ్వాలో, ఎడవాలో అర్థం కాలేదు అన్నారు. రంజాన్‌ తోఫా పేరుతో చంద్రబాబు వారి అనుచరులకే సరుకులు ఇచ్చారని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక పరంగా బాగుంటేనే సమాజం బాగుంటుందని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎల్లో మీడియా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కథనాలను ప్రచారించాలి హితవు పలికారు. సమావేశంలో వైసిపి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
బాబు హయాంలో ఒక్క ఆసుపత్రికి కూడా నిధులు ఇవ్వలేదు: మంత్రి విడదల రజని Tue, Dec 06, 2022, 12:02 AM
ఆ కేసులో సీఐడీ విచారణకు హాజరైన ఏబీఎన్ ఛానల్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ Mon, Dec 05, 2022, 11:59 PM
ఏపీలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు...వెల్లడించిన వాతావరణ శాఖ Mon, Dec 05, 2022, 11:54 PM
బస్ స్టాప్ లోకి దూసుకొచ్చిన,,, ట్రక్ఆరుగురు అక్కడికక్కడే మరణం Mon, Dec 05, 2022, 11:51 PM
బోల్తా కొట్టిన టాటా ఏస్ వాహనం...నలుగురు అయ్యప్ప స్వాముల దుర్మరణం Mon, Dec 05, 2022, 11:50 PM