by సూర్య | Thu, Nov 24, 2022, 08:28 AM
వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో వైద్య రంగంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి వెనుకడుగు వేయడం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి ఏకంగా కోటి రూపాయలు సాయం చేసి మనసున్న ముఖ్యమంత్రిగా మరోసారి వైయస్ జగన్ దాతృత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి చేసిన సాయానికి ఓ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. ఇందుకు చిన్నారి తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తిరుమలకు కాలినడకన మొక్కులు తీర్చుకోడానికి వెళ్తున్నారు. ఇప్పుడు చిన్నారిని ఆరోగ్యం కుదుటపడింది. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటుంది. ఇందుకు కారణం.. ఆనాడు సీఎం వైయస్ జగన్ చేసిన గొప్పసాయంగా చెబుతారు ఈ కుటుంబ సభ్యులు. వీరిపుడు 17 రోజులుగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పాదయాత్రగా.. 700 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రస్తుతం తిరుమలకు వెళ్లే దారిలో ఉన్నారు.
Latest News