తెలుగుదేశం దిక్కుతోచని స్థితిలో దివాళాకోరు, చౌకబారు ఎత్తుగడలు వేస్తోంది

by సూర్య | Thu, Nov 24, 2022, 08:28 AM

ఏపీ మొత్తానికి ద్రోహం చేసిన బాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మరోసారి బురిడీకొట్టించే ప్రయత్నాలు చెల్లవు అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబును హెచ్చ‌రించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులు వంటి ప్రతిపాదనలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. మరో పక్క మూడున్నరేళ్లుగా ప్రతిపక్షంలో కునారిల్లుతున్న తెలుగుదేశం దిక్కుతోచని స్థితిలో దివాళాకోరు, చౌకబారు ఎత్తుగడలు వేస్తోంది. జనం నుంచి స్పందన లేక టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్‌ పూనకం వచ్చినట్టు ఎక్కడబడితే అక్కడ ఊగిపోతున్నారు. వారి నోళ్లకు హద్దూపద్దూ లేకుండా పోయాయి. చైతన్యరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం కార్యకర్తలు, చోటామోటా నేతలను తమ తప్పుడు వ్యూహాలతో తండ్రీకొడుకులిద్దరూ బలిచేస్తున్నారు. తమ నేతల పోకడలు చూసి టీడీపీ కేడర్‌ బెంబేలెత్తిపోతోంది. ‘ఇలాంటి బుర్రలు లేని నేతలు మాకు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఖర్మకాకపోతే!’ అంటూ వారు తలలు పట్టుకుని వాపోతున్నారు అని ఎద్దేవా చేసారు. 

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM