వైసీపీ తీరు మారదు

by సూర్య | Wed, Nov 23, 2022, 03:11 PM

‘వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అబద్ధాలనే ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కూడా మోసాలతోనే కాలం గడిపిస్తోంది’. అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష విమర్శిం చారు. అధికారపార్టీ ఆగడాలపై ఇంటింటికి వెళ్లి నిజాల్ని చెబుదామని శ్రేణుల కు పిలుపునిచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట నిర్వహించే కార్యక్రమంపై పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆమె కార్యకర్తలతో మాట్లాడారు. వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దుచేస్తామని జగన్‌ ఇచ్చిన హామీ నుంచి ప్రత్యేక హోదా, జాబ్‌ క్యాలెండర్‌, పాఠశాలల విలీనం పేరిట మోసం.. ఇలా అన్నింటిపై ప్రజలకు నిజాన్ని తెలియజేయాలని సూచిం చారు. ప్రజల ఓట్లు టీడీపీకి మరలేంతవరకూ నిజాల్నే ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాతపట్నం మాజీఎమ్మెల్యే కలమట వెంకటరమణ, నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, మొదలవలస చిరంజీవి, పీఎంజే బాబు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్ Thu, Dec 07, 2023, 09:04 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల Thu, Dec 07, 2023, 08:55 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు Thu, Dec 07, 2023, 08:38 PM
విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ Thu, Dec 07, 2023, 05:08 PM
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు Thu, Dec 07, 2023, 05:07 PM