సామాన్యులకు భారంగా మారిన ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి

by సూర్య | Wed, Nov 23, 2022, 03:10 PM

అన్ని రంగాల్లో విఫలమైన వైసీసీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం కిరప పంచాయతీ పరిధిలోని కిరప, జొన్నడు గూడ, పెద్దగూడ, కాంగూడ, సన్నాయి నాయుడుగూడ, నాయుడుగూడ, రాయిమానుగూడ గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్‌, డీజి ల్‌, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యు లపై భారం మోపారని ఆరో పించారు. సామాన్యులకు భారంగా మారిన ఈ ప్రభు త్వాన్ని గద్దె దించాలని ప్రజ లకు కోరారు. కార్యక్రమంలో సీతంపేట మండల టీడీపీ అధ్యక్షుడు సవర తోటముఖలింగం, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి బిడ్డిక చం ద్రరావు, సవర సొడంగో, గేదెల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు! Thu, Feb 29, 2024, 04:23 PM
చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతున్నా: లావు Thu, Feb 29, 2024, 04:22 PM
పవన్‌ వామనుడు కాదు శల్యుడు: పేర్ని నాని Thu, Feb 29, 2024, 04:22 PM
ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు Thu, Feb 29, 2024, 03:59 PM
మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తా Thu, Feb 29, 2024, 03:33 PM