బలహీనపడిన అల్పపీడనం, ఊపిరి పీల్చుకుంటున్న రైతులు

by సూర్య | Wed, Nov 23, 2022, 03:04 PM

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం మంగళవారం ఉదయం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కాగా ఈ నెల 24న ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM