నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం.. జపాన్ లో టెన్షన్

by సూర్య | Tue, Oct 04, 2022, 11:56 AM

నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం. మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని మంగళవారం దక్షిణ కొరియా సైన్యం నిర్ధారించింది.ఉత్తర కొరియా తూర్పు వైపున గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ సైతం ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ఈ మిస్సైల్ ప్రయాణ సమయంలో హోక్వైడో ద్వీపంలోని ప్రజలంతా తమను తాము కాపాడుకోవాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు.. కొన్ని రైళ్ల రాకపోకలనుసైతం తాత్కాలికంగా రద్దు చేసింది.


ఉత్తర కొరియా తీరును జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని హింసాత్మక ప్రవర్తన గా ఆయన అభివర్ణించారు. ఉత్తర కొరియా తీరుపై జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ నుంచి 3వేల కిలోమీటర్ల దూరంలో ఈ మిసైల్ పడిందని, దీనివల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రభుత్వం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 7.29 గంటలకు ప్రజలంతా భవనాల లోపలికి కానీ, భూగర్భ షెల్టర్లలోకి కానీ వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా సైన్యం ఓ ప్రకటన చేసింది.. క్షిపణి ప్రయోగం ఉదయం 7.23 గంటలకు జరిగిందని, జపాన్ గగనతలం నుంచి అది దూసుకెళ్లిందని తెలిపింది.


 

Latest News

 
18 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్ట్ Thu, May 02, 2024, 10:43 AM
నలుగురు ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:28 AM
ఆదరించండి అభివృద్ధి చేస్తా: జయచంద్ర Thu, May 02, 2024, 10:25 AM
మదనపల్లెలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం Thu, May 02, 2024, 10:22 AM
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM