కార్మిక హక్కుల కోసం పోరాడుదాం: సిఐటియు

by సూర్య | Tue, Oct 04, 2022, 11:35 AM

హక్కులు, డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అసరముందని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. శ్రీనివాసులురెడ్డి, బి. మనోహర్‌ అన్నారు. సోమవారం ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ డే సందర్భంగా ప్రపంచ కార్మిక సంఘాల పిలుపుమేరకు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కులను, డిమాండ్లను సాధించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

1945, అక్టోబరు 3న డబ్ల్యుఎఫ్‌టియు స్థాపించారని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచ శాంతికి ప్రమాదాలు, బెదిరింపులు పెరిగాయన్నారు. అదే సమయంలో సామ్రాజ్యవాదులు తమ ప్రయోజనాల కోసం పాలస్తీనా, క్యూబా, ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలపై దాడి చేస్తున్నారని చెప్పారు. సిరియా, వెనిజులా ఇతర ప్రాంతాలపై తమ జోక్యాలను ఆంక్షలను కొనసాగిస్తున్నారని చెప్పారు. పోరాటాల ద్వారా సంఘటిత మిలిటెంట్‌ డిమాండ్లతో మాత్రమే కార్మిక ఉద్యమం, లక్ష్యం సాకారమవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ. రామాంజనేయులు, చంద్రారెడ్డి, ఓబులేసు, మౌలాలి, ఉదరు, రమణ, నాయుడు పాల్గొన్నారు.


 

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM