ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం

by సూర్య | Tue, Oct 04, 2022, 11:36 AM

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం కావాలని ఉయ్యూరు ఆర్డీఓ విజ య్ కుమార్ సూచించారు. కంకిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పునాదిపాడు, తెన్నేరు, దావులూరు


గ్రామాల్లోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఆయా మిల్లులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. 2022 ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్మిల్లు యజమానులతో సమీక్షించారు. ఆర్‌డీఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం సేకరించే విషయమై ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలన్నారు. రైతులు, కౌలురైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.


ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన వరి విత్తన రకాలు, గత సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, నగదు చెల్లింపులను తహసీల్దార్ టీవీ సతీషన్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పునాదిపాడు గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రం 185 పరిధిలో ఓటర్ల ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ తనిఖీ చేశారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ బీఎల్‌ఓలకు సూచనలు ఇచ్చారు. తనిఖీలో ఆస్ట్ వెంకటరమణ, వీఆర్ఓలు పాల్గొన్నారు.

Latest News

 
అమరావతి రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం.. రైతుల ఆగ్రహం Thu, Apr 18, 2024, 07:56 PM
మనసు మార్చుకున్న కేఏ పాల్.. ఆ నియోజకవర్గంలో కూడా పోటీ Thu, Apr 18, 2024, 07:52 PM
రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీలోకి వెళుతున్న కీలక నేత Thu, Apr 18, 2024, 07:49 PM
వైఎస్ వివేకా హత్య కేసులో సంచలనం.. చంద్రబాబు, పవన్, షర్మిల, సునీతలకు కోర్టు కీలక ఆదేశాలు Thu, Apr 18, 2024, 07:36 PM
ఓ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అట్ట పెట్టెల్లో గుట్టు, పెద్ద ట్విస్టే ఇది! Thu, Apr 18, 2024, 07:33 PM