ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలి

by సూర్య | Fri, Sep 23, 2022, 11:20 AM

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని కోరుతూ మండల టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘంటసాల ప్రధాన సెంటర్, ఘోటకం కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహలకు టిడిపి నేతలు పాలాభిషేకాలు చేసి నిరసన తెలియజేశారు.ఈ సందర్బంగా టిడిపి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సాఆర్ పేరును చేర్చటం దుర్మార్గమైన చర్య అన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా స్థాపించిన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందన్నారు. కొత్తగా యూనివర్సిటీని స్థాపించుకుని వైఎస్సాఆర్ పేరు పెట్టుకోవాలని హితవు పలికారు.


నందమూరి తారక రామారావు వైద్య, విద్య పరిశోధన నిమిత్తం ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎన్టీఆర్ తీసుకొచ్చిన యూనివర్సిటీకి ఆయన పేరునే కొనసాగించగా, యూనివర్సిటీ ఏర్పాటులో ఏలాంటి సంబంధం లేదని వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరు ఆ యూనివర్సిటీకి పెట్టడం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్మార్గ ఆలోచనకు నిదర్శనమని అన్నారు. యూనివర్సిటీ పేరు మార్చటం ద్వారా విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొంటుందన్నారు.


151 సీట్లతో అధికారం ఇస్తే ప్రజలకు మేలు చేయాలి గానీ, సంఖ్యాబలముందనే దుష్ప్రభావంతో ఇలా నిర్ణయాలు తీసుకోవటం తగదని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, మాజీ పిఏసిఎస్ అధ్యక్షులు బండి పరత్పరరావు, టిడిపి నేతలు అయినపూడి భాను ప్రకాష్, గొర్రెపాటి సురేష్, గొర్రెపాటి శ్రీనివాస్, అయినపూడి కోటేశ్వరరావు, వేమూరి రమేష్, జగ్గారపు నాగేశ్వరరావు, తుమ్మలచర్ల మురళీకృష్ణ, గొర్రెపాటి శ్రీనివాసరావు ( ఓఎన్జీసి రిటైర్డ్ ఉద్యోగి), దిరిశం సుదర్శన్, సోలే శ్రీను, టిడిపి యువత తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM