ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన కళ్యాణ్ రామ్

by సూర్య | Fri, Sep 23, 2022, 11:20 AM

ఎన్టీఆర్ మెడికల్ యూనివర్శిటీ పేరుని మారుస్తూ , ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ని తప్పుబడుతూ ఇప్పటికే చాలామంది స్పందించారు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తన దైన శైలిలో స్పందించాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య , విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది.


ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు అని తమ భావాన్ని వ్యక్తపరిచారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM