పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది: కె. నారాయణ

by సూర్య | Thu, Sep 22, 2022, 08:09 PM

తన తండ్రి పేరు పెట్టుకోవాలని జగన్ అనుకుంటే రాష్ట్రంలో ఎన్నో యూనివర్శిటీలు, కాలేజీలు ఉన్నాయని... కావాలంటే వాటికి వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చని  సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. యూనివర్శిటీ పేరును మార్చడం ద్వారా జగన్ ఒక దారుణమైన సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లను మార్చుకుంటూ పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 


ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోనే తొలి హెల్త్ యూనివర్శిటీని విజయవాడలో స్థాపించారని తెలిపారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం దుర్మార్గమని అన్నారు. జగన్ చర్య చాలా ఫన్నీగా ఉందని విమర్శించారు. తన నిర్ణయాన్ని జగన్ వెంటనే వెనక్కు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM