![]() |
![]() |
by సూర్య | Thu, Sep 22, 2022, 04:21 PM
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపించకుండా సిబ్బంది ప్రజల్ని రక్షించాలని కోరారు. ఆమె చాంబర్‌లో గురువారం అదనపు కమిషనర్ డా. సన్యాశిరావు, ప్రధాన వైద్యాధికారి శాస్త్రి, బయాలజిస్టు దోర, మలేరియా సిబ్బందితో మేయర్ సమీక్షించారు. రానున్న వర్షాకాల సీజన్‌కు ఇప్పటి నుంచే సచివాలయాల వారీ అవగాహన కల్పించాలని, నిత్యం వలంటీర్లు సహా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. అన్ని చోట్లా ఫ్యాగింగ్ చేయాలని, మిషన్లు మరమ్మతులకు గురైతే తక్షణమే బాగు చేయించాలన్నారు. సీజన్ నేపథ్యంలో వ్యాధుల నియంత్రణకు అవసరమైతే సిబ్బంది అదనంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. నగర ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా జీవీఎంసీ పనిచేస్తుం దన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి, ఫ్రిడ్జిలు, టైర్లు, పూల కుండీలు, ఫ్లవర్ వాజ్‌లు తదితర చోట్ల నీరు నిలువ లేకుండా చూడాలని, యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలని మేయర్ ఆదేశించారు.
Latest News