చెరువుల అభివృద్ధి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:10 PM

ప్రపంచ బ్యాంకు, జపాన్‌ సహకార ఆర్థిక సంస్థ(జైకా) నిధులతో చేపడుతున్న చెరువుల అభివృద్ధి పనులను మార్చి లోగా పూర్తి చేయాలని జిల్లా జల వనరుల శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా జల వనరుల శాఖ కార్యాలయంలో అభివృద్ధి పనులపై ఈఈలు, డీఈలతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సాగునీరు- వ్యవసాయ పరివర్తన పథకం (ఏపీఐఐఏటీపీ) పథకం కింద ప్రపంచ బ్యాంకు నిధులతో జిల్లాలో 26 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టగా. ఇప్పటి వరకు నాలుగు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు నత్తనడకన సాగుతుండగా ఆరు పనులు ప్రారంభం కాలేదు, 32 చెరువుల అభివృద్ధి పనులు జైకా నిధులతో చేపట్టగా.. ఐదు పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశలో ఉండగా.. నాలుగు పూర్తి కాలేదని చెప్పారు.

Latest News

 
వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ Sat, Jan 28, 2023, 11:52 AM
వైభవంగా తిరుచ్చి వాహన సేవ Sat, Jan 28, 2023, 11:51 AM
రథసప్తమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు Sat, Jan 28, 2023, 11:32 AM
బిగ్ బాస్ చూడొద్దు: హైకోర్టు Sat, Jan 28, 2023, 11:06 AM
స్త్రీల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించండి Sat, Jan 28, 2023, 10:34 AM