కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో 8.79 లక్షల మంది భక్తులకు దర్శనం

by సూర్య | Thu, Sep 22, 2022, 04:09 PM

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గత నెల 31వ తేదీ నుంచి ఈ నెల 20 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు, ప్రత్యేకోత్సవాల్లో 8, 79, 782 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ అగరం మోహన్‌రెడ్డి, ఈవో ఎంవీ సురేశ్‌బాబు తెలిపారు. భక్తుల కొనుగోలు చేసిన దర్శనం టికెట్ల విక్రయం ద్వారా స్వామివారికి రూ. 1, 04, 36, 350 ఆదాయం సమకూరిందన్నారు.


విరాళాల ద్వారా మరో రూ. 40. 44 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు వివరించారు. 23 రోజుల్లో భక్తులు స్వామివారికి హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ. 2. 07 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. 8 వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు వివరించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM