ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుర్మార్గమైన చర్య: అయ్యన్న

by సూర్య | Thu, Sep 22, 2022, 04:08 PM

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం చాలా దారుణం ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగు వారి గుండెచప్పుడు నందమూరి తారక రామారావు పేరు హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ఎన్టీఆర్ చరిత్ర ఒకరు చెరిపేస్తే చెరిగేది కాదని, ఆ మహానుభావుడు ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకర్తని అన్నారు. అవసరమైతే మీరు మెడికల్ కాలేజీలు కట్టండి కట్టిన వాటికి మీ పేరు పెట్టుకోండి, ఎవరో కట్టిన కాలేజీలకు మీరు పేర్లు పెట్టుకోవడమేనా మీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఇప్పటికైనా ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని అన్నారు.

Latest News

 
రథసప్తమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు Sat, Jan 28, 2023, 11:32 AM
బిగ్ బాస్ చూడొద్దు: హైకోర్టు Sat, Jan 28, 2023, 11:06 AM
స్త్రీల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించండి Sat, Jan 28, 2023, 10:34 AM
నిజాయితీ చాటుకున్న ఉపాధ్యాయులు Sat, Jan 28, 2023, 10:32 AM
ఏపీ బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ పదవీనుంచి రాజపుత్ర రజని తొలగింపు Fri, Jan 27, 2023, 11:49 PM