'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక

by సూర్య | Thu, Apr 25, 2024, 05:41 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి 'కుబేర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా కనిపించనున్నట్లు సమచారం.


ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రష్మిక ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిందని సమాచారం. కొద్ది వారాల క్రితమే రష్మిక ఈ చిత్రంలో భాగం కానుందని ప్రకటించగా ఇప్పుడు ఆమె రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది.


ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.


అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'ప్రాజెక్ట్ Z' మూవీ Thu, May 09, 2024, 09:53 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఇంద్రాణి' Thu, May 09, 2024, 08:12 PM
OTT : చిత్రీకరణ ప్రారంభించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 Thu, May 09, 2024, 08:10 PM
రేపు రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' Thu, May 09, 2024, 07:41 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, May 09, 2024, 07:39 PM