'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...!

by సూర్య | Thu, Apr 25, 2024, 03:21 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. పుష్ప 2 యొక్క పవర్-ప్యాక్డ్ టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ప్రోమోని పుష్ప పుష్ప అనే టైటిల్ తో విడుదల చేయగా, ఫుల్ సాంగ్ ని మే 1న ఉదయం 11:07 గంటలకి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
'హరోమ్ హర' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, May 09, 2024, 05:55 PM
సాయి పల్లవి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'అమరన్' టీమ్ Thu, May 09, 2024, 05:49 PM
'కన్నప్ప' సెట్స్ లో జాయిన్ అయ్యిన ప్రభాస్ Thu, May 09, 2024, 05:47 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, May 09, 2024, 05:45 PM
'టర్బో' UK అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ Thu, May 09, 2024, 04:30 PM