కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు

byసూర్య | Wed, Oct 23, 2024, 07:35 PM

తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ నల్గొండలో ఉన్న 12 బెటాలియన్ ముందు కానిస్టేబుల్ భార్యలు సోమవారం (అక్టోబర్ 21 ) రోజున ధర్నా నిర్వహించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ధర్నాపై స్పందిస్తూ.. సమస్యలను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు.. కానిస్టేబుళ్లకు ఊహించని షాక్ ఇచ్చారు. భార్యలు ధర్నా చేస్తే.. భార్తలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు బెటాలియన్ పోలీస్ ఉన్నతాధికారులు. ఈ మేరకు.. 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఎందుకు సస్పెండ్ చేస్తున్నారని అడిగితే.. వాళ్లు చెప్పిన కారణం విని అవాక్కవటం కానిస్టేబుళ్ల వంతయింది. "మీ భార్యలు ధర్నా చేశారు. అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం.." అని కానిస్టేబుళ్లతో ఉన్నతాధికారులు చెప్పటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.


12 బెటాలియన్‌లో పనిచేస్తున్న వందల మంది పోలీసుల భార్యలు ధర్నాకు దిగారు. వారి భర్తలపై పనిభారం తగ్గించాలని.. అర్డర్లీ వ్యవస్థను రద్దు చేయటంతో పాటు.. కామన్ మెస్ తీసివేయాలని, రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ మాదిరిగానే పెట్టాలని, కొత్తగా వచ్చే రికార్డు పద్ధతి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. బెటాలియన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పోలీసుల భార్యల ధర్నాతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో.. ఇది కాస్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.


ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బెటాలియన్ ఉన్నతాధికారులు మంగళవారం (అక్టోబర్ 22న) రోజున ఉదయం సుమారు 20 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. అయితే.. అందులో ఒకరు ఆర్డర్ తీసుకోగా.. మిగిలిన వాళ్లు మాత్రం తమ భార్యలు ధర్నా చేస్తే.. తమను సస్పెండ్ చేయటమేంటని ప్రశ్నిస్తూ.. అధికారుల నుండి ఆర్డర్ కాపీ తీసుకోలేదని తెలుస్తోంది. అయినా.. ఇంత మంది ధర్నా చేస్తే తమపై మాత్రమే కక్ష సాధింపు చర్యలు తీసుకోవటమేంటని ప్రశ్నిస్తున్నారట.


ఇదిలా ఉంటే.. మిగిలిన వారిపై కూడా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి సస్పెండ్ ఆర్డర్ కాపీలు ఇచ్చినట్లు సమాచారం. అయితే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. మిగిలిన పోలీసులందరూ మూకుమ్మడిగా పోరాటానికి సిద్ధమైనట్టు సమాచారం. సస్పెన్షన్‌కి గురయిన పోలీసుల్లో హెడ్ కానిస్టేబుళ్లు నర్సింగ్, రామకృష్ణ, కానిస్టేబుళ్లు వినోద్, సురేష్, నాగరాజు, అష్రఫ్‌కు సస్పెన్షన్ ఆర్డర్ కాపీ ఇచ్చారు.



Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM